హోటల్ కు వెళ్లాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పై మరోసారి అప్రమత్తమయింది. కఠినమైన ఆంక్షలను విధించబోతుంది.

Update: 2021-12-02 08:54 GMT

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పై మరోసారి అప్రమత్తమయింది. కఠినమైన ఆంక్షలను విధించబోతుంది. ఇప్పటికే ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లోనూ విధిగా మాస్క్ లను ధరించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది.

వ్యాక్సిన్ వేయించుకోకుంటే...?
ఇక హోటల్ కు, పార్క్ లకు, సినిమాలకు వెళ్లాలన్నా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతిస్తారు. రెండు డోసుల వ్యాక్సిన్ చేయించుకున్న వారికే అనుమతి ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఎక్కడికి వెళ్లినా నో ఎంట్రీ అని త్వరలో ఆదేశాలను ప్రభుత్వం వెలువరించనుంది.


Tags:    

Similar News