Revanth Reddy : బీఆర్ఎస్ పై రేవంత్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-02-04 08:09 GMT

బీఆర్ఎస్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణన సర్వే ను సభలో పెడుతున్నప్పటికీ సభకు ప్రతిపక్ష నేత రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి వర్గం సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిపక్ష నేతకు సభకు రావాలి కదా? అని అన్నారు. తాము చిత్త శుద్ధితో కులగణన సర్వే చేపట్టామన్న రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వే ఫలితాలను ఏం చేసిందని ఆయన నిలదీశారు. కులగణన చేసి తాము చరిత్ర సృష్టించామన్నారు.

కులగణన సర్వే అందుకే...
కులగణన జరపాలని ప్రధానిపై కూడా వత్తిడి వస్తుందని ఆయన తెలిపారు. సర్వేను కూడా పకడ్బందీగా నిర్వహించిన తర్వాతనే తాము నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ ను నియమించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదన్న రేవంత్ రెడ్డి అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే తాము ఈ సర్వే నిర్వహించామని అన్నారు. పకడ్బందీగా సమాచారాన్ని సేకరించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదన్నారు.


Tags:    

Similar News