పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవీ ఇంజెక్షన్

హైదరాబాద్ కు సమీపంలోని పోచారంలో అమానవీయ ఘటన జరిగింది

Update: 2026-03-14 07:41 GMT

హైదరాబాద్ కు సమీపంలోని పోచారంలో అమానవీయ ఘటన జరిగింది. ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి హెచ్.ఐ.వి ఉన్న రక్తాన్ని యువకుడు ఎక్కించాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతోనే హెచ్ఐవీ ఇంజెక్షన్ ను యువతికి గుచ్చాడని పోలీసులు తెలిపారుు.

పోచారంలో ఘటన...
యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే హెచ్ఐవీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు తో యువతికి వివాహం నిశ్చయం అయింది. అయితే యువకుడికి హెచ్ఐవీ ఉందని తేలడంతో పెళ్లికి యువతి నిరాకరించింది. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో హెచ్ఐవీ ఇంజెక్షన్ చేశాడు. పోచారం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News