Breaking : మెదక్ జిల్లాలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురి మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Update: 2026-03-14 11:57 GMT

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఒక బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. తండ్రీ కొడుకులు, చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సును ఢీకొని...
నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అతి వేగంతో వస్తూ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టడ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతులు ముగ్గురూ మెదక్ జిల్లా వాసులుగానే గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News