Hyderabad : పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం
మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం రేగింది
మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం రేగింది. ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫౌమ్ హౌస్‌గా గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలను ఎదుర్కొన్న ఎనిమిది మంది అరెస్టు చేశారు. రివాల్వర్, కొకైన్ స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ పార్టీ సమాచారంతో...
డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసి సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్ ను అక్కడి వారు అడ్డుకున్నారు. పోలీసులను చూసి పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీమ్‌ను అడ్డుకుని హంగామా చేసే యత్నం జరిగింది. పార్టీలో డ్రగ్స్.. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ బుల్లెట్లు ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. సమాచారం తెలిసి రంగంలోకి దిగిన ఎస్.ఓ.టీ పోలీసులు అక్కడ కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. పార్టీలో రాజకీయ నేతలు ఉన్నట్లుగా చెబుతున్న పోలీసులు, పైలట్ రోహిత్ రెడ్డి సహా ఎనమిది మంది వీ ఐ పీ లు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.