ఒక్క ఇల్లు కూల్చకుండా సుందరీకరణ చేపట్టాం : కేటీఆర్

మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవానికి కేసీఆర్‌ హయాంలో చర్యలు చేపట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

Update: 2026-03-15 03:35 GMT

మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవానికి కేసీఆర్‌ హయాంలో చర్యలు చేపట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మూసీ పునరుజ్జీవానికి ప్రపంచంలోని పది పెద్ద సంస్థలను ఆహ్వానించామన్నారు. మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజల ఇళ్లు కూల్చకుండా డిజైన్లు చేపట్టాలని సంస్థలను కేసీఆర్‌ కోరారని కేటీఆర్ తెలిపారు. కొన్ని ఇళ్లు కూల్చాల్సి వస్తుందని కొన్ని సంస్థలు సూచించాయన్న కేటీఆర్ రివర్‌ బెడ్‌ నిర్మాణాలైతే తప్ప మిగతావి ముట్టవద్దని కేసీఆర్‌ చెప్పారన్నారు. తప్పకుండా కూల్చాల్సి వస్తే ప్రాజెక్టును పక్కన పెడదామని కేసీఆర్‌ చెప్పారని, ఐదు కిలోమీటర్ల మేర పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని కేసీఆర్‌ సూచించారని కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

మురికి నీటిని శుద్ధీకరణ చేసి...
నాగోల్‌, ఉప్పల్‌, అంబర్‌పేట మధ్య ఒక్క ఇల్లు కూల్చకుండా ప్రాజెక్టు చేపట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. మూసీ నుంచి ఘట్‌కేసర్‌ వరకు 57 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే డిజైన్‌ చేశామని, మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుక్కను శుద్ధీకరించామని, సివరేజ్‌ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా మురికినీరు శుద్ధీకరించామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌ హయాంలోనే రూ.4 వేల కోట్లతో సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటయిందని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పేదల ఇళ్లను కూల్చి మూసీని ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అనుకోవడం అవివేకమైన చర్య అని అన్నారు.


Tags:    

Similar News