నేడు కొండగట్టుకు బండి సంజయ్
నేడు బండిసంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు.
నేడు బండిసంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ లో ఎన్నికయిన నూతన ప్రజాప్రతినిధులతో కలిసి అంజన్నకు బండిసంజయ్ మొక్కులు తీర్చుకోనున్నారు.
పాదయాత్ర ద్వారా...
కరీంనగర్ లో ఉదయం బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు కొండగట్టు బండిసంజయ్ చేరుకోనున్నారు. ఈ పాదయాత్రలో పది వేల మందిది కార్యకర్తలు యాత్రలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముండటంతో వారు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.