నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది.

Update: 2025-02-18 02:36 GMT

group 1 mains exam 

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ గవాయి ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ పై గెలిచి తర్వాత అధికారం కోల్పోయాక కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ...
తెలంగాణ స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్‌ పిటీషన్ ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం గత విచారణ సందర్భంగా నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. స్పీకర్ కార్యాలయం సమయం నిర్ణయించకపోతే తాము నిర్ణయమిస్తామని చేసిన వ్యాఖ్యలతో నేడు ఎలా స్పందిస్తుందన్న టెన్షన్ లో పార్టీ మారిన నేతలున్నారు.


Tags:    

Similar News