Telangana : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతతపై నేడు తీర్పు
తెలంగాణలో ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
తెలంగాణలో ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ కు, అసెంబ్లీ కార్యదర్శికి పలుమార్లు నోటీసులు ఇచ్చి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలను వినింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి. ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, దానం నాగేందర్ , తెల్లం వెంకట్రావు తదిరులున్నారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పనుందో?
నేడు అనర్హతపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? లేక స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తుందా? అన్న టెన్షన్ నెలకొంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది. ఇప్పటికే కొందరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ వేయడంతో ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింద.ి