Supreme Court : మూడు నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందే.. స్పీకర్ కు ఆదేశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Update: 2025-07-31 05:39 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పై మూడు నెలల లోపు శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పింది. బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి మారడంతో బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.

తీర్పు చెప్పిన ధర్మాసనం...
దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి, మనీహ్ ధర్మాసనం తుదితీర్పును ప్రకటించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత పై తేల్చాలని అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.


Tags:    

Similar News