నేడు వైన్ షాపులు బంద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ ఉంటాయని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ ఉంటాయని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద “డ్రై డే” బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా జనవరి 26న డ్రై డే పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ రోజు మద్యం విక్రయం పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రేపు ఉదయం నుంచి...
షాపులు తిరిగి జనవరి 27న ఉదయం నుంచి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఎవరైనా దుకాణాలు తెరిచినా, అనధికారికంగా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ వైన్ షాపుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.