నీటి కుంటలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లో దారుణం జరిగింది.

Update: 2026-01-26 03:55 GMT

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి లో దారుణం జరిగింది. ఉరుకొండ మండలం ముచ్చర్ల పల్లి గ్రామంలో నీటి కుంట లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతూ రోదిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తుంది.

హైదరాబాద్ నుంచి వచ్చి...
హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చి పొలం దగ్గర ఆడుకుంటుండగా ఘటన,ఒకరిని కాపాడబోయి మరో ఇద్దరు నీటిలో మునిగి పోయారని స్థానికులు తెలిపారు. .మృతిచెందిన విద్యార్థులు ముచ్చర్లపల్లికి చెందిన సిరి శ్రీమన్యు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల కు చెందిన చెందిన స్నేహ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News