Telangana : మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు రానున్నారు. అగ్రనేతల రాకతో స్పీడ్ పెంచే యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ వరసగా సమావేశాలను నిర్వహిస్తుంది.
నిజామాబాద్ బీజేపీ ఆఫీస్‌కు...
మరొకవైపు నేడు నిజామాబాద్ బీజేపీ ఆఫీస్‌కు ఎంపీ అర్వింద్ రానున్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆయన స్థానిక కార్యకర్తలతో నిర్వహిస్తున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న ఎంపీ అర్వింద్ మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ఆయన వ్యూహాలను రచించనున్నారు.