ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పంపారు

Update: 2026-01-24 04:28 GMT

మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పంపారు. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన తెలిపారు. తన పై అవాస్తవాలను మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ చెప్పారని, ఇందులో వాస్తవాలు లేవంటూ సజ్జనార్ నోటీసుల్లో పేర్కొన్నారు.

రెండు రోజుల్లో...
ప్రవీణ్ కుమార్ తనపై చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, తనపై ఏడు కేసులు నమోదయి ఉన్నాయని ఆయన చెప్పారని, అందుకు సంబంధించిన క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు ఇవ్వాలని, వివరాలు ఇవ్వకపోతే క్రిమినర్ చర్యలు తప్పవని నోటీసులు పంపారు. ఈ నోటీసులకు ప్రవీణ్ కుమార్ ఏ సమాధానం ఇస్తారన్నది చూడాలి.


Tags:    

Similar News