Telangana : బీఆర్ఎస్ సింగరేణిపై నీతులు చెబుతోంది : కల్వకుంట్ల కవిత
సింగరేణి కాంట్రాక్టులపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
సింగరేణి కాంట్రాక్టులపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందనితెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ ల విషయంలో సృజన్ రెడ్డి చిన్న చేప అని, మేఘా కృష్ణారెడ్డికి రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. దాని మీద బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పట్టించుకోవటం లేదని, పెద్ద కాంట్రాక్టర్ ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తోందన్నారు.
బీఆర్ఎస్ తప్పులే చేయనట్లుగా...
సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడటం విచిత్రంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. గుంటనక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ గుంతలో పడ్డాడడన్నారు. గతంలో సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్ట్ లు ఇచ్చారని, అప్పుడు రేవంత్ రెడ్డి బావమరది అని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని మేము గమనిస్తున్నామన్న కవిత కేటీఆర్ పై కథనం వస్తే ఒక నీతి? దళిత మహిళపై కథనం వస్తే ఒక నీతా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఓ లూజర్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీయేనని కల్వకుంట్ల కవిత అన్నారు.