హోం ఐసొలేషన్ లోనే అయినా.. తెలంగాణలో?

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 851 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

Update: 2022-07-31 02:45 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 851 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరణాలు ఏవీ నమోదు కాలేదు. మరణాలు లేకపోవడం కొంత ఊరట కల్గించే అంశమే అయినా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అందరూ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని, ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాకపోవడం ఊరట కల్గించే అంశంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.

యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,19,141 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 8,09,661 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది కరోనా బారిన పడి మరణించారని అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఐదువేలకు పైగానే ఉండటం ఆందోళన కల్గిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 5,369 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News