తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. నిబంధనలను పాటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి

Update: 2022-06-18 02:27 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. నిబంధనలను పాటించకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసుల క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 279 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మరణాలు ఏవీ సంభవించలేదు. కరోనా తీవ్రత పెరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

యాక్టివ్ కేసులు.....
ప్రస్తుతం తెలంగాణలో 1,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పట వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,956,572గా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 7,89,680 మంది కోలుకున్నారు. భౌతిక దూరం, మాస్క్ లు ధరించకపోవడం, శానిటైజర్లను వినియోగించకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News