తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్

తెలంగాణలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది.

Update: 2022-06-24 03:39 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్న మొన్నటి వరకూ తక్కువగా ఉన్న కరోనా కేసులు నేడు ఐదు వందలకు చేరువలో ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడం, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వేసవి సెలవులకు పర్యాటక కేంద్రాలకు తరలి రావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో 494 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు.

యాక్టివ్ కేసులు...
మొత్తం నమోదయిన 494 కేసుల్లో 315 కేసులు హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 3,048కి చేరుకున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,97,633 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి 7,90,473 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వాడకం వంటివి చేయకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.


Tags:    

Similar News