Ponnam Prabhakar : నారా లోకేశ్ పై మంత్రి పొన్నం ఫైర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారని అన్నారు. నికర జలాలు,మిగులు జలాలు ,వరద జలాలు గురించి ముందుతెలుసుకోవాలంటూ హితవు పలికారు. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృష్ట్యా 968 టిఎంసి లు తెలంగాణ కు ,531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలన్నారు.
తెలుసుకుని మట్లాడాలంటూ...
వరద జలాల లభ్యత పైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తరువాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు ఆనాడు ట్రిబ్యునల్ లు కేంద్ర ప్రభుత్వలు నిర్ణయించిన విధంగా మా నీటిని ఒక చుక్క కూడా వదులుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీటికి సంబంధించిన అంశాల పై ఇరు రాష్ట్రాలు గడిచిన వాతావరణం తెచ్చుకునే పరిస్థితి మంచిది కాదన్న ఆయన మా కోటా మా వాటా మా నీటి వినియోగం పూర్తికాకముందే మీరు వరద జలాల పేరు మీద ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారని మాట తేవడానికి మా రాష్ట్ర ప్రయోజనాలు మా రైతుల హక్కుల కోసం బాజప్తా మాట్లాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.