Telangana : గ్లోబల్ సమ్మిట్ లో భారీగా ఒప్పందాలు
హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి
హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎం వంతారా బృందం వోయూ చేసుకుంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న కొత్త జూపార్కుకు ఎంవోయూ కుదుర్చుకుంది.- ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని, జంతువుల సేవ నినాదంతో వంతార పనిచేయడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
విద్యుత్తు శాఖలో...
మరొకవైపు తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఒప్పందాలు గ్లోబల్ సమ్మిట్ లో జరిగాయి. నిన్న ఒక్క రోజే రెండు లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. మైహోమ్ పవర్ సంస్థ రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.దీనివల్ల 12,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.