కవితా.. నీ బండారం బయటపెడతా
కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు
కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చరిత్ర ఏంటో తనకు తెలుసునని ఆయన అన్నారు. ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదని అన్నారు. హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కవిత ప్లాన్ వేశారని అన్నారు. కేసీఆర్ పై అభిమానంతో తాము కవితపై మాట్లాడటం లేదని మాధవరం కృష్ణారావు అన్నారు. నీ సంగతి, నీ మొగుడు సంగతి ఏంటో తనకు తెలుసునని అన్నారు.
మంత్రి పదవులు అమ్ముకుని...
మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసునని మాధవరం కృష్ణారావు అన్నారు. నీ బండారం బయటపెడితే నువ్వు బయట కూడా తిరగలేవని మాధవరం కృష్ణారావు అన్నారు. హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టి, కేటీఆర్ ను అరెస్ట్ చేయించి దోచుకు తినడానికే ప్లాన్ చేశామని ఆయన మండిపడ్డారు. నీ మొగుడి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని మాధవరం కృష్ణారావు అన్నారు.