Telangana: హోలీ నాడు నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 3 ఫలితాలు నేడు
హోలీ నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.
హోలీ నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈరోజు గ్రూప్ 3 ఫలితాలు వెలువడనున్నాయి. గ్రూప్ 3 ఫలితాలకు సంబంధించిన రాతపరీక్షల రిజల్ట్ ను నేడు టీజీపీఎస్సీ వెల్లడించనుంది. వరసగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు గ్రూప్ 3 పరీక్షల ఫలితాలను వెల్లడించనుంది.
నవంబరులో జరిగిన...
ఈరోజు గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి జనరల్ ర్యాంకు జాబితాను వెల్లడించనుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలను 5.36 లక్షల మంది దరఖాస్తు చేశఆరు. అయితే ఇందులో కేవలం 50.24 శాతం మంది మాత్రమే గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో పరీక్షలు జరగ్గా నేడు ఫలితాలు విడుదల కానుండటంతో నిరుద్యోగులకు తీపి కబురు హోలీ పండగ రోజు అందనుంది.