తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 219 కరోనా కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 219 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉంటుంది. నమోదయిన 219 కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 164 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవువుతుండటంతో అధికారులల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.
నిబంధనలను పక్కన పెట్టి....
కరోనా తగ్గుముఖం పట్టడంంతో కనీసం నిబంధనలు ప్రజలు పాటించడం లేదు. సమ్మర్ హాలిడేస్ లో ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారితో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడం, మాాస్క్ ధరించడం వంటివి మర్చిపోవడంతో కరోనా మళ్లీ ఎక్కువవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.