తెలంగాణాలో భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇది ప్రమాదకరమైన సంకేతమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

Update: 2022-06-22 02:13 GMT

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇది ప్రమాదకరమైన సంకేతమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణాలో 403 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం చోటు చేసుకోలేదు. దాదాపు నాలుగు నెలలు దాటిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూశాయని అధికారులు చెబుతున్నారు. కేసులు మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

జాగ్రత్తలు పాటించకుంటే...
ఇప్పటి వరకూ తెలంగాణలో 7,96,408 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కొంత పెరుగుతూనే ఉంది. ఇపపటి వరకూ 7,90,108 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటి వకూ 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు పూర్తి నిబంధనలను పాటించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు సయితం జాగ్రత్తగా ఉండాలని కోరారు.


Tags:    

Similar News