నేడు గాంధీభవన్ లో ముఖ్యనేతల సమావేశం
నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగనుంది
caste enumeration in telangana
నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమయ్యే రైతు పండగ పై చర్చించనున్నారు. రైతు సదస్సులో ప్రభుత్వం తరుపున ఇవ్వనున్న హామీలపై చర్చించనున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై...
అంతేకాకుండా త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా నేతలు చర్చించనున్నారు. ముఖ్యనేతలు అందరూ సమన్వయంతో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఇందుకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరనున్నారు.