Mallu Bhatti Vikramarka : అజారుద్దీన్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీజేపీ పై మండిపడ్డారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీజేపీ పై మండిపడ్డారు. అజారుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. మైనారిటీకి చెందిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటుంటే దానిని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు, మంత్రి వర్గ విస్తరణకు సంబంధం ఏంటని మల్లు ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ లు కలసి...
ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని చూస్తున్నాయని, కానీ చివరకు గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రమేనని మల్లు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు గెలిపిస్తారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.