KCR : నేడు కేసీఆర్ కీలక సమావేశం

నేడు కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు

Update: 2025-12-26 04:50 GMT

నేడు కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రె్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కీలక నేతలతో భేటీ...
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమై సభలను ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ భారీ బహిరంగ సభలను నిర్వహించాలన్న నిర్ణయంతో ఈ సమవేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.


Tags:    

Similar News