బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-12-25 07:33 GMT

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు శని అని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని దృష్టి మరల్చడానికే కృష్ణాజలాల అంశాలను కేసీఆర్ తెరపైకి తెచ్చారన్నారు. కేసీఆర్, జగన్ ల మధ్య జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్, జగన్ లఒప్పందాన్ని...
అలాగే కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం కూడా సమంజసమేనని అన్నారు. ఆయన తన హయాంలో అనేక మందిఫోన్ లను ట్యాపింగ్ చేశారన్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా సరికాదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు అహంకారం ఎక్కవ లని, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడాతాము ఖండించామనిచెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయనకే నష్టమని బండి సంజయ్ అన్నారు. కృష్ణా జిలాల పై తాను ఆధారాలతో గతంలో బయటపెట్టిన విషయాన్ని బండి సంజయ్ తెలిపారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ వ్యాఖ్యలను సుమోటాగాతీసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


Tags:    

Similar News