నేడు ఆదిలాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నేడు ఆదిలాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు
నేడు ఆదిలాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం11:45కి రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో కొత్తగా క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు. దీని ద్వారా మరింత మెరుగైన సేవలు రోగులకు అందే అవకాశాలున్నాయని ఆసుప్రతి వర్గాలు చెబుతున్నాయి.
రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్...
రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొత్త ఎయిర్‌పోర్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌర విమాన యాన శాఖ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సమీకరించింది. అనంతరం సర్పంచుల సమ్మేళనానికి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ మద్దతుదారులైన సర్పంచ్ ల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.