Telangana : రైతు భరోసా నిధుల విడుదల పై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల

రైతు భరోసా నిధుల విడుదల పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2025-12-25 07:53 GMT

రైతు భరోసా నిధుల విడుదల పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే యాసంగిలో సాగవుతున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారురు. శాటిలైట్ చిత్రాల ద్వారా రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి సాగవుతుందో తెలియచేయాలని అధికారులను ఆదేశించారు.

నివేదిక అందిన తర్వాతే...
నివేదిక అందిన తర్వాత త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా కింద సాగవుతున్న ప్రతి ఎకరాకు నగదును చెల్లించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. దీంతో పాటు వచ్చేనెలలో వ్యవసాయ యాంత్రీకారణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పున:ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


Tags:    

Similar News