Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో...
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పీసీసీ చీఫ్ లు, ప్రత్యేక ఆహ్వానితులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశముంది. సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వత మంత్రివర్గ విస్తరణపై రేవంత్ పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చించే అవకాశాలున్నాయి.