Telangana : నేడు కేసీఆర్ కీలక భేటీ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో జరుగుతున్న భేటీకి ఇప్పటికే పలువురికి ఆహ్వానం అందింది. జూబ్లీహెల్స్ ఉప ఎన్నికలపై నేతలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై ఆయన నేతలకు వివరించనున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల్లో...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో దానిని తిరిగి గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. అందుకోసం సానుభూతి ఓట్లను సాధించేందుకు మాగంటి గోపీనాధ్ సతీమణి సునీతను ఎంపిక చేసింది. కాంగ్రెస్ మాత్రం నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. బీజేపీ దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. త్రిముఖ పోటీ ఉండటంతో ఓట్ల చీలకుండా వ్యూహంతో ముందుకు వెళ్లడంపై కేసీఆర్ నేడు నేతలతో చర్చించనున్నారు.