Telangana : ఫాం హౌస్ లో కేసీఆర్ కీలక భేటీ

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు.

Update: 2025-10-22 06:37 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో ప్రచారం ఎలా నిర్వహించాలి? ఓటర్లను ఆకట్టుకోవడం, పోలింగ్ ను తమపార్టీ అభ్యర్ధికి అనుకూలంగా మార్చుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం తమ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో దానిని గెలుపించుకునేందుకు అవసరమైన వ్యూహాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముందని తెలిసింది. అలాగే ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టేలా నేతలు వ్యవహరించాలని కేసీఆర్ నేతలకు ఆదేశాలు జారీచేయనున్నారు. రేపు బీఆర్ఎస్ ఇన్ ఛార్జులతో కేటీఆర్ సమావేశం అవుతున్న నేపథ్యంలో ఆయనకు కొన్ని సూచనలు కూడా చేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News