జూరాలకు పోటెత్తుతున్న వరద నీరు
జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు కొనసాగుతుంది.
జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు కొనసాగుతుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారుల పథ్నాలుగు గేట్లు తెరిచి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్ష 15 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో లక్ష 26 వేల 017 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.560 మీటర్లుగా ఉంది.
పదకొండు యూనిట్లలో...
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 7.759 టీఎంసీలుగా ఉంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా వరద నీరు పెరిగే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.