Telangana : ఈసారి చిలకపచ్చ రంగు చీరల పంపీణీ
తెలంగాణలో ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఈసారి చిలకపచ్చ రంగుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి చిలకపచ్చ రంగుతో, ఎరుపు జరీ డిజైన్‌తో కొత్త చీరలను మహిళలకు అందించనున్నారు. కోటి చీరల తయారీకి టెస్కోకు రూ.450 కోట్ల ఆర్డర్ ఇచ్చారు.
గతంలో నీలం రంగు చీరలు...
గతంలో నీలం రంగు చీరలు ఇవ్వగా, ఈసారి కొత్త రంగును ఎంపిక చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ నాటికి తయారీ పూర్తి చేసి, నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది