Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
మహిళా రిజర్వేషన్లపై...
ప్రధానంగా మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల పెంపుపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.