Telangana : సాదాబైనామా దరఖాస్తులలో కొత్త మార్గదర్శకాలివే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2026-04-10 04:50 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. జీవో నం.76, 77ల ప్రకారం దరఖాస్తులను పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను ప్రాధాన్యంగా పరిష్కరించాలి.

ముప్ఫయి రోజులపాటు...
దరఖాస్తుదారుల అర్హతలు, హక్కులు, భూమి స్వాధీనం, అవసరమైన పత్రాలను ఆర్డీవోలు పరిశీలించాలి. సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు అఫిడవిట్‌తో పాటు సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వివరాలను భూ భారతి పోర్టల్‌లో ముప్ఫయి రోజులు ఉంచి, అభ్యంతరాలు లేకపోతే సర్టిఫికెట్ ఇస్తారు.


Tags:    

Similar News