Telangana : ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-04-10 05:46 GMT

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత కొంత కాలంగా తమ డీఏను పెంచాలని కోరుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డీఏను 2.1 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది జనవరి 1 నుంచి...
పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరుతున్నాయి.


Tags:    

Similar News