నేడు కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నేడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కానున్నారు

Update: 2026-04-10 05:38 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నేడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ కానున్నారు. జీవన్ రెడ్డిని లంచ్ మీటింగ్ కు రావాలని కేసీఆర్ ఆహ్వానించడంతో జగిత్యాల నుంచి బయలుదేరి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోనున్నారు.

వేదిక.. ముహూర్తం...
నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత అన్ని విషయాలను మాట్లాడుకున్నారు. అయితే త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇందుకు ముహూర్తం, వేదికను కూడా ఈ భేటీలో ఖరారు అయ్యే అవకాశాలున్నాయి.సమావేశం తర్వాత జీవన్ రెడ్డి  బయటకు వెల్లడించే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News