Telangana : నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు

తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు

Update: 2026-04-10 05:23 GMT

తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వివరాలు డీజీపీ శివధర్‌రెడ్డి ఈ లొంగుబాటుకు సంబంధించిన వివరాలను అందించనున్నారు. ఆపరేషన్ కగార్ కు సమయం మించిపోయిన తర్వాత కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు.

30 మంది మావోయిస్టులు...
ఎక్కువ మంది మావోయిస్టులు దశల వారీగా లొంగిపోతున్నారు. అందులో భాగంగానే నేడు ముప్ఫయి మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. లొంగిపోనున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించనున్నారు.


Tags:    

Similar News