ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది

Update: 2025-08-29 07:18 GMT

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఆమెపై వేసిన డిశ్చార్జ్ పిటీషన్ ను కొట్టివేయడంతో శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఓబులాపురం మైనింగ్ కేసులో...
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలు జీవితం గడిపి వచ్చారు. అయితే ఆమెకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం, తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటీషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించినట్లయింది.


Tags:    

Similar News

.