Kamareddy : కామారెడ్డిలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇబ్బంది కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది
భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇబ్బంది కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి మరోసారి భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఇరవై నాలుగు గంటల నుంచి ప్రజలు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఫ్లాష్ ఫ్లడ్స్ తో...
మరొకవైపు కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్, భారీ వరదల కారణంగా కామారెడ్డి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి-నిజామాబాద్ మార్గం వైపు వెళ్లే అన్ని రైళ్లు నిలిపివేశారు. ప్రయాణికులు గమనించి, వేరే మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. రోడ్డు మార్గాలు కూడా అనేక చోట్ల దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.