KCR : కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉంది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే ఉంది. ఆయన ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే ఉంది. ఆయన ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయన ఈరోజు కూడా బీఆర్ఎస్ నేతలతో ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదని, ఆయన మామూలుగానే రోజు వారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ...
గత మూడు రోజులుగా మాజీ మంత్రి హరీశ్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదనితెలిపారు. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, అలాంటి వదంతులను నమ్మవద్దంటూ బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.