KCR : మరోసారి అస్వస్థతకు గురైన కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తీసుకు వచ్చే అవకాశముందని తెలిసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు రోజలుగా అస్వస్థతకు గురి కావడంతో వైద్యుల బృందాన్ని ఎర్ర వెల్లి ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో కూడా ఉన్నారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ...
గత మూడు రోజులుగా మాజీ మంత్రి హరీశ్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అయితే ఆయనను హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తీసుకు వస్తారా? లేక ఫామ్ హౌస్ వద్దకే వైద్యులను తీసుకెళతారా? అన్న దానిపై మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వైరల్ ఫీవర్ తో కేసీఆర్ రెండు రోజులుగా బాధపడుతున్నట్లు సమాచారం.