కామారెడ్డిలో తొలి ఒమిక్రాన్ కేసు.. ఎయిర్ పోర్టులో 8మందికి పాజిటివ్ !

తాజాగా రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో కలిపి రాష్ట్రంలో

Update: 2022-01-05 05:19 GMT

తెలంగాణలో రోజురోజుకీ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తూ.. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో కలిపి రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కి చేరింది. ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఇటీవలే అతను అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకోగా.. మూడ్రోజుల క్రితమే అతని నమూనాలను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలడంతో బాధిత వ్యక్తిని హైదరాబాద్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఇతర దేశాల నుంచి నిన్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 127 మంది చేరుకోగా.. వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 8 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో.. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు. వారికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా.. ఎల్లారెడ్డిలో ఒమిక్రాన్ కేసు నమోదవ్వడంతో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆ గ్రామమంతా శానిటైజ్ చేయించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.


Tags:    

Similar News