Sun Dec 14 2025 01:54:41 GMT+0000 (Coordinated Universal Time)
అత్తింటి ముందు మహిళ ధర్నా
అత్తామామల వేధింపులను భరించలేక ఒక మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

అత్తామామల వేధింపులను భరించలేక ఒక మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన భర్త, అత్తమామలు, ఆడబిడ్డల వేధింపులను తట్టుకోలేకపోతున్నానని ఆ మహిళ ఆరోపిస్తుంది.
అదనపు కట్నం కోసం...
యాదాద్రి జిల్లా ఇంద్రపాలనగరం కు చెందిన రవళిని కుషాయిగూడకు చెందిన వెంకటేష్ కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. కట్నం కింద ఎనిమిది లక్షల నగదు, ఇరవై తులాల బంగారాన్ని ఇచ్చారు. అయితే అదనపు కట్నం కావాలని కొద్దిరోజులుగా భర్త, అత్తమామలు, ఆడబిడ్డ వేధిస్తుండటంతో ఆమె ధర్నాకు దిగింది. ఆమెకు అండగా మహిళా సంఘాలు పాల్గొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- Tags
- kushaiguda
- abuse
Next Story

