ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు : కోమటిరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
komatireddy raj gopal reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముగిసిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని జోస్యంచెప్పారు. కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.
ఆ రెండు నియోజకవర్గాల్లోనూ...
ఎన్నికలు త్వరగా వస్తున్నందున కార్యకర్తలు, నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ను గద్దె దించి ఫాంహౌస్ కు పంపాల్సిన సమయం దగ్గర పడిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో గద్దె దింపితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇకపై తాను కోదాడ, హుజూర్ నగర్ లలో కూడా పర్యటిస్తానని ఆయన తెలిపారు.