శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలకలం... 11 మందికి కరోనా

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పదకొండు మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు తేలింది

Update: 2021-12-03 12:26 GMT

విమానాలు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ వాసులకు గుండె గుభిల్లుమంటోంది. అందులో ప్రయాణికులకు ఒమిక్రాన్ వేరియంట్ ఉంటుందేమోనన్న ఆందోళన కలుగుతుంది. తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పదకొండు మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయింది.

వివిధ దేశాల నుంచి....
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గత రెండు రోజులుగా వచ్చిన విదేశీ ప్రయాణీకుల్లో పన్నెండు మందికి కరోనా సోకింది. ఈ ఒక్కరోజు ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. పన్నెండు మందిలో తొమ్మిది మంది యూకే నుంచి, ఒకరు సింగపూర్ నుంచి ఒకరు కెనడా నుంచి , ఒకరు అమెరికా నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీరి రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్స్ కి పంపారు. నివేదికల కోసం వేచి చూస్తున్నారు. వీరందరినీ ఐసొలేషన్ కు పంపారు.


Tags:    

Similar News