తెలంగాణలో పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్డం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 836 మందికి కరోనా సోకింది
తెలంగాణలో కరోనా కేసులు తగ్డం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 836 మందికి కరోనా సోకింది. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇది కొంత ఊరట కల్గించే అంశమైనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 38,122 మందికి పరీక్షలు చేయగా 836 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు...
ఇప్పటి వరకూ 8,17,367 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,08,276 మంది కోలుకున్నారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజులో 765 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 4,986 యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.