మళ్లీ కోవిడ్ నిబంధనలు తప్పవా?
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతుంది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరోజులోనే 852 కేసులు నమోదయ్యాయి. దాదాపు మూడు నెలల్లో ఇవే అత్యధికంగా నమోదయిన కేసులు. అయితే మరణాలు సంభవించకపోవడం ఒక రకంగా ఊరట కల్గించే అంశమే. నిన్న ఒక్కరోజులోనే 640 మంది కరోనా వైరస్ బారి నుంచి బయటపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,16,531 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 8,07,505 మంది కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో 4,915 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.89 శాతంగా ఉండటం కొంత ఊరట కల్గించే పరిణామం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కోవిడ్ నిబంధనలను కఠినతరం చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.